చీమ నేర్పిన చిట్టి పాఠం

అల్పజీవి అని చిన్న చూపు చూసిన సింహానికి చీమ నేర్పిన పాఠం ఏమిటి?

Description

అనగనగా నీలగిరి అనే అడవిలో *** అనే ఒక గంభీరమైన సింహం ఉండేది. అది ఒక్క పంజా దెబ్బతో ఎటువంటి జంతువునైనా పడగొట్టగల బలశాలి. ***కి తనని మించిన శక్తివంతులూ, గొప్పవాళ్ళూ ఎవరూ లేరన్న గర్వం.

ఒకరోజు *** ఒక జింకని వేటాడి తింటూఉంది. ఆ పక్కనే పుట్టలో నివసిస్తున్న *** అనే ఒక చిన్న చీమ, సింహం తిని వదిలేసిన జింక కళేబరం నుంచి కొద్దికొద్దిగా మాంసాన్ని తన నివాసంలోకి చేరవేయటం మొదలుపెట్టింది.